కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఏర్పాటు కుదరదు: మల్లికార్జున ఖర్గే

-

మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల భేటీకి ప్రధాన ప్రతిపక్షాలు డుమ్మా కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వేదిక పంచుకోవడంపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, ఆప్ పార్టీలు భేటీకి వెళ్లకూదని నిర్ణయించుకున్నాయి. అయితే డీఎంకే, శివసేన వంటి పార్టీల నుంచి పార్టీ అధ్యక్షులు కాకుండా కీలక నేతలు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ లేకుండా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి కుదరదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఎంకె స్టాలిన్ (టిఎన్ సిఎం), కె చంద్రశేఖర్ రావు (తెలంగాణ సిఎం), ఉద్ధవ్ థాకరే (మహారాష్ట్ర సిఎం) మరియు చాలా మంది పెద్ద నాయకులు పాల్గొనడం లేదని.. ఐక్యత, ఏకగ్రీవ అభ్యర్థి కావాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా  50 శాతం ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. బీజేపీపై కలిసికట్టుగా పోరాడాలనుకుంటున్నామని.. అందుకే మీటింగ్ కు వెళ్తామని ఆయన అన్నారు. అయితే విపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్ ను నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తాను పోటీలో ఉండనని ఎన్సీపీ కార్యకర్తలు, నేతల సమావేశంలో  వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news