వాహనదారులకు శుభవార్త: దేశంలో మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు.

దేశ ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. త్వరలో పెట్రోల్, డిజిల్ తగ్గించేందుకు కేంద్రం ప్రణాళిక రచించింది. ఈ నెల మొదటి వారంలో దీపావళి కానుకగా దేశ ప్రజలకు పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల లీటర్ పెట్రోల్ పై రూ. 5, డిజిల్ పై రూ. 10 తగ్గించారు. ఈ నిర్ణయం తరువాత పలు రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధరలను తగ్గించాయి. ఇలా తగ్గించినా… పెట్రోల్ ధరలు సెంచరీ కిందకు రాలేదు. తాజాగా మరోసారి కేంద్రం పెట్రోల్ , డిజిల్ ధరలు తగ్గించేందుకు సిద్ధం కావడంతో సామాన్యుడికి ఇది బిగ్ రిలీఫ్ కానుంది.

తాజాగా పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం వ్యూహాత్మక పెట్రోల్ నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల పెట్రోలియం నిల్వలను విడుదల చేయనుందివ. దీని వల్ల ఇంధన సరఫరా పెరిగి పెట్రోల్, డిజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. దేశంలో పెట్రోల్ ధరలు తగ్గడానికి రిజర్వ్ పెట్రోల్ నిల్వలను వాడాలని భారత్ కు అమెరికా సూచించింది.