దేశంలో పెట్రోల్ ధరలను దీపావళి కానుకగా కేంద్రం తగ్గించింది. పెట్రోల్ పై రూ.5, డిజిల్ పై రూ.10 లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని తదనంతరం పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలోని నడిచాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గాయి. తాజాగా మరో రాష్ట్రం కూడా పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ పెట్రోల్ పై రూ. పెట్రోల్ పై రూ. 10, డిజిల్ పై రూ. 5 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది.
ప్రస్తుతం ఇప్పటి వరకు పెట్రోల్ , డిజిల్ ధరలను తగ్గించినవి బీజేపీ పాలిత రాష్ట్రాలే. తాజాగా పెట్రోల్ ధరలను తగ్గించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. రాబోయే ఏడాది ఎన్నికలు ఉండటంతో ఈ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డిజిల్ పై ధరలను తగ్గించడం అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో తాజాగా పెట్రోల్ ధరల తగ్గింపు అంశం కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని ఆపార్టీ భావిస్తోంది.