Bigg Boss 5 Telugu: కండల వీరుడి ఖేల్ కతం! ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అత‌డే..

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సిజ‌న్ 5.. బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆక‌ట్టుకున్న రియాల్టీ గేమ్ షో. గ‌త సీజ‌న్ల‌తో పోల్చి చూస్తే.. ఈ సీజ‌న్ అంత‌గా ఆకర్షించడం లేదు. ప్రోమోలు, గేమ్ ల విష‌యంలో కాస్త బాగానే ఉందని అనుకున్న‌. ఎలిమినేష‌న్ల విష‌యంలో మాత్రం అంత‌గా ఇంట్రెస్టింగ్ లేద‌నే చెప్పాలి. ఈ రియాల్టీ షో రేటింగ్ రావ‌డానికి వరుసగా ప్రోమో విడుదల చేయ‌మేన‌ని చెప్పాలి. ఈ ప్రోమోలు ఎపిసోడ్ లపై.. ఆసక్తిని పెంచుతున్నాయి. షోను చూసేలా చేస్తున్నాయి.

అలాగే.. కంటెస్టెంట్స్ మధ్య ఫైర్ కనిపించడం లేదని.. టైటిల్ గెలువాల‌ని ఎవ‌రికీ లేద‌నీ, ఏదో హౌస్లో ఉన్నామా లేదా అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. బుల్లితెర ప్రేక్ష‌కులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ షో మొత్తంలో చాలా హాట్ హాట్ జ‌రిగేవి నామినేష‌న్లు మాత్రమే. నామినేష‌న్లు అన‌గానే.. హౌస్ మొత్తం ఓ సారిగా హీట్ ఎక్కుతుంది. కానీ, వారంతంలో జ‌రిగే.. నామినేషన్ ల్లో ఈ జోష్ క‌నిపించ‌డం లేదు.

ఆడటానికి వచ్చినట్లు కాకుండా ఏదో సరదాగా టూర్ కి వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్. ఇకపోతే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది బిగ్బాస్ ఐదవ సీజన్. 8 మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు అన్న విషయం తెలిసిందే. కాగా నేడు 9వ వారం లో ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి రాబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓ వైపు అన్ అఫిసియ‌ల్ పోల్స్, మ‌రోవైపు లీకు వీరులు అస‌లు విష‌యాన్ని ముందు బ‌య‌ట పెట్టే స‌రికి అంత ఇంట్రేస్టింగ్ ఉండ‌టం లేదు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన పోల్స్ ప్ర‌కారం చూస్తే.. జెస్సి ఇక ఈ వారం ఎలిమినేట్ అవుతాడని తొలుత వార్త‌లు వెల్లువెత్తాయి. కానీ ఈ వారం జెస్సీ అనారోగ్యంగా ఉన్నా కూడా ఆడుతున్నాడే సంప‌తి వ‌ర్క్ అవుట్ అయ్యింది. మరోవైపు జెస్పీకి సిరి, షణ్ణు ఫాలోయర్స్ కూడా ఫుల్ గానే స‌పోర్టు చేస్తుండ‌టంతో సేవ్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఇక చివరగా కాంట్రవర్సీ క్వీన్ కాజల్ కూడా ఈ వారం ఎలిమినేష‌న్లో ఉంది. కానీ, త‌న‌దైన ఇమేజ్ తో దూసుక‌పోతుంది. డేంజర్ జోన్ నుంచి త‌ప్పించుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇంట్లో ఈమె లేకపోతే మసాలా ఉండదేమో అని భావించిన ఆడియన్స్ ఓట్లు వేసి సేవ్ చేసారు. ఇక ఇంట్లో చివ‌రిగా మిగిలింది విశ్వ, ప్రియాంక.

ఇప్పటి వరకు ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టకుండా తనదైన శైలిలో గేమ్ ఆడుతూ కండాల వీరుడు విశ్వ అవుట్ అయ్యే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోవ‌డంతో లీకు రాయులు కూడా .. ఇదే విషయాన్ని వెల్ల‌డిస్తున్నారు. విశ్వ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. రెండుసార్లు ఇంటి కెప్టెన్ అయిన విశ్వ.. ఈ సారి మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. మాట్లాడితే ఏడవడం.. లేదంటే ఫిజికల్‌గా వెళ్లిపోవడం తప్పిస్తే మైండ్ గేమ్ లేదనే విమర్శ మనోడిపై ముందు నుంచి ఉంది. అదే శాపంగా మారిపోయింది.

మ‌రోవైపు.. బిగ్‌బాస్‌ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈసారి హౌజ్‌ నుంచి ఒక్కరిని కాకుండా ఇద్దరిని ఎలిమినేట్‌ చేయనున్నారని ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. వీరిలో ఒకరు విశ్వ కాగా మరొకరు ప్రియాంకగా అని తెలుస్తోంది. ప్రియాంక కూడా డేంజ‌ర్ల జోన్లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. అందరికంటే తక్కువ ఓట్లు పింకీకి వ‌చ్చిన‌ట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news