దసరా పండుగకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా భారీ కుట్ర పన్నింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే లక్ష్యంగా ఈ కుట్ర పన్నినట్లు సమాచారం. ఉగ్రదాడులకు సంబంధించి పీఎఫ్ఐ పన్నిన పన్నాగాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం వర్గాలు చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు బయటకొచ్చాయి. నాగ్‌పుర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం కూడా పీఎఫ్‌ఐ టార్గెట్ లిస్ట్‌లో ఉందని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.
దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని పీఎఫ్ఐ ప్రణాళికలు చేసినట్లు సమాచారం. వీరిని టార్గెట్ చేసుకుని దేశంలో.. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ, సంఘ్ నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు కూడా నిర్వహించినట్లు ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.