ఇవాళ, రేపు సీఎం వైయస్ జగన్ తిరుమల పర్యటన, నంద్యాల జిల్లా పర్యటనతో బిజీ కానున్నారు. ఇక ఇవాళ బ్రహ్మొత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం… బుధవారం నంద్యాల జిల్లాలో రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం.. స్వామి వారిని దర్శించుకోనున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న సీఎం జగన్.. బుధవారం ఉదయం 6.05 గంటలకు స్వామివారిని దర్శించుకోనున్నారు.
అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్.. 7.10 గంటలకు టీటీడీ కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్‌ను ప్రారంభిస్తారు. 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి ఓర్వకల్ బయలుదేరుతారు. 10.55 గంటలకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల చేరుకుని రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.05 గంటలకు ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.