నిందితుడు రాజు మృతిపై ట్విస్ట్ : హై కోర్టులో పిటిషన్

సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు నిన్న వరంగల్ జిల్లా స్టేషన్ గన్ పూర్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజు మృతి పై అనుమానం ఉందంటూ హైకోర్టు లో పిల్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిటిషన్ ను వేశారు. రాజు ది కస్టోడియల్ మృతిగా అనుమానాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ చేపడతామని ప్రకటించింది.

ఇదిలా ఉండగా రాజు తమ ముందే ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే కూలీలు చెబుతున్నారు. కోణార్క్ ట్రైన్ కింద పడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే అధికారులు చెప్పారు. కానీ రాజు మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులే రాజును ఉరికించి చంపారని రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.