రోజురోజుకి దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకున్న ఇలాంటి నయవంచకులు మాత్రం మారడం లేదు. తాజాగా కర్ణాటకలోని బెల్గాంలో కు చెందిన సురేష్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈయన తన కోరిక తీర్చాలని తన దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న బీటెక్ విద్యార్థిని వేధించసాగాడు. ముందుగా సదరు విద్యార్థినితో పరిచయం పెంచుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య చాటింగ్లు, ఫోన్లు లాంటివి జరిగాయి కూడా.
ఇక ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ తన కీచక బుద్ధిని బయట పెట్టాడు. తనని ప్రేమించాలని ఆ అమ్మాయిని వేధించసాగాడు. ప్రొఫెసర్ నిజస్వరూపం తెలుసుకున్న అమ్మాయి అతన్ని దూరం పెట్టసాగింది. దీంతో అనేకమార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా వీటికి స్పందించకపోవడంతో తనను దూరం చేసి పెడుతుంది అన్న భావనలో ఆమెపై కక్ష సాధింపు యత్నం చేశాడు. ఆ విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. దీనితో భయపడిపోయిన ఆ యువతి ధైర్యంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందించింది. దీంతో నిందితుడు సురేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.