భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాలతో పోల్చుకుంటే దీని ప్రభావం మహారాష్ట్రపై అధికంగా ఉంది. దీంతో కరోనాపై పోరాటంలో ముందున్న పోలీసులు కూడా వైరస్ మహమ్మారి బారినపడుతున్నారు.తాజాగా.. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 279 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోమవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం 5,454 మంది పోలీసులకు కరోనా సోకింది.
అందులో 1,074 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 70 మంది పోలీస్ సిబ్బంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు మహారాష్ట్ర పొలిసు శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే కరోనా లక్షణాలున్న పోలీసులకు వైద్యసేవల కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తునట్టు రాష్ట్ర హోంమంత్రి తెలిపిన విషయం తెలిసిందే.