షాకింగ్ : సాధారణ ఇంటికి 25 లక్షల కరెంట్ బిల్లు.!

-

లాక్ డౌన్ తర్వాత అధికారులు పంపిస్తున్న కరెంట్ బిల్లులు చూసి సామాన్య ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడూ వందల్లో వచ్చే బిల్ లాక్ డౌన్ సమయంలో ఒక్కసారిగా లక్షల్లో వస్తుంటే జనాలు వణికిపోతున్నారు. తాజాగా.. హైదరాబాద్ లోని ఇంటికి ఏకంగా 25 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. లాలాపేటలో నివాసముండే ఓ వ్యక్తికి సాధారణంగా నెలకు రూ.500 నుంచి 600 కరెంట్ బిల్లు వచ్చేది. అయితే మార్చి 6 నుంచి జులై 6 వరకు ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించింది.

అందుకు ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు. ఇక సదరు వినియోగదారుడి ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు. కాగా, తెలంగాణలో విద్యుత్ బిల్లులకు నిరసనగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ విద్యుత్ బిల్లుల షాక్ సెలబ్రిటీలకు సైతం తగులుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news