కేటీఆర్ ను కలిసే అవకాశమివ్వండంటూ బ్యాలెట్ బాక్సులో లెటర్..

-

తెలంగాణలోని 120 మునిసిపాలిటీల్లో 2,647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలు కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. అనంతరం బ్యాలెట్ పేపర్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 134 కౌంటింగ్‌ కేంద్రాల్లో 2,169 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. మంథనిలో బ్యాలెట్ బాక్సులో ఓట్లను లెక్కిస్తున్న అధికారులకు ఓ లేఖ దొరికింది.

ఓట్లతో పాటు బాక్సులో లేఖ ఉండటంతో అధికారులు ఆశ్చ‌ర్య‌పోయారు. అస‌లు ఆ లేఖలో ఏముందా అని ఓపెన్ చేసి చదివారు. అది ఓ దివ్యాంగుడు మంత్రి కేటీఆర్ కు రాసిన లేఖ. మంత్రి కేటీఆర్ ను కలవాలని ఉందని దివ్యాంగుడు ఆ లేఖలో రాశాడు. వెన్నెముక గాయాలతో దివ్యాంగుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని లేఖలో వాపోయాడు. కేటీఆర్ ను కలిసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని లేఖలో కోరాడు. మరి దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news