రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు రూ.4 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటు లో ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ లో చేరితే ఏడాదికి రూ.6 వేలు పొందొచ్చు. కానీ ఇవి విడతల వారీగా వస్తాయి. ఒకే సారి కాకుండా విడతల వారీగా వస్తాయి.
ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారికి ఈ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒక వేళ మీరు చేరానట్టయితే వెంటనే దీనిలో రూ.4 వేలు పొందే అవకాశం వుంది. దీనిలో చేరితే మీకు కూడా డబ్బులు వస్తాయి.
మూడు విడతల లో రూ.2 వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాల లో జమవుతాయి. జూన్ 30లోపు పీఎం కిసాన్ స్కీమ్ లో చేరితే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. అలాగే తర్వాత ఆగస్ట్ నెల ఇన్‌స్టాల్‌మెంట్ కూడా పొందొచ్చు.
ఈ పీఎం కిసాన్ స్కీమ్ లో చేరడం కూడా సులువే. ఈ స్కీమ్ లో చేరడానికి ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఆన్‌లైన్‌లోనే ఇంట్లో నుంచే మీరు ఈ పథకంలో చేరొచ్చు. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్ కి వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. ఇలా చేరడానికి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పొలం పాస్‌బుక్ వంటివి అవసరం అవుతాయి.