హైదరాబాద్ మెట్రో ఎక్కే వాళ్ళు ఉన్నారా…? అయితే తెలుసుకోండి

తెలంగాణాలో లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. లాక్ డౌన్ కి సంబంధించి ప్రజలను అలెర్ట్ చేయడమే కాకుండా నిన్న సడలింపు సమయం కూడా పెంచింది. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో మరోసారి మార్చారు. ఇవాల్టి నుంచి మెట్రో సర్వీసుల సమయం పెంచారు. లాక్ డౌన్ సడలింపులతో టైమింగ్స్ మార్చుతున్నట్లు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ప్రకటన చేసారు.

ఉదయం 7గంటల నుంచి మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. మూడూ క్యారిడారల్లోని స్టేషన్లలో 11:45 గంటలకు చివరి ట్రైన్ ఉంటుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు చివరి గమ్య స్థానం చేరుకుంటుంది అని అధికారులు పేర్కొన్నారు. నిన్నటి వరకూ రోజుకు 3వేల లోపే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేసారు.