పీఎం కిసాన్ నుండి డబ్బులు వస్తున్నాయా..? ఈ సర్వీసులపై చార్జీలు… చూసుకోండి..!

-

కేంద్రం రైతుల కోసం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ తో మనం ఎన్నో లాభాలని పొందొచ్చు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ కూడా ఒకటి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద చాలా మంది రైతులు డబ్బులు పొందుతున్నారు.

farmers

అయితే మీరు కూడా ఈ డబ్బులని పొందుతున్నట్టయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ స్కీమ్ నుండి మీరు డబ్బులని పొందాలంటే కచ్చితంగా ఇకేవైసీ ప్రక్రియ ని పూర్తి చేసుకోవాలి. ఇకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు వస్తాయి. లేదంటే ఇబ్బందే. ఇంకా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలని అనుకునే రైతులు ఆన్‌లైన్‌లోనే నేరుగా మీరే ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇకేవైసీ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో కనుక ఇకేవైసీ పూర్తి చేసుకుంటే ఎలాంటి డబ్బులు పే చెయ్యాల్సిన పని లేదు. ఈజీగా అయ్యిపోతుంది. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా చెయ్యచ్చు. ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందే రైతులు అందరూ ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే స్కీమ్ డబ్బులు రావు. బయోమెట్రిక్ విధానంలో కామన్ సర్వీస్ సెంటర్ కి వెళ్లి ఈ ప్రక్రియ ని పూర్తి చేసుకుంటే రూ. 15 చార్జీ చెల్లించాలి. కేంద్రమే వీటిని నిర్ణయించింది. కావాలనుకుంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా ఓటీపీ విధానంలో ఇకేవైసీ ప్రక్రియ ని పూర్తి చేసుకోవచ్చు. అప్పుడు ఎలాంటి చార్జీలు పడవు.

 

Read more RELATED
Recommended to you

Latest news