ప్రధాని మోదీ: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయండి !

-

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన “సంకల్ప్ సప్తాహ్” అనే పేరుతో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాంక్ష జిల్లాను అమలు చేయాలని మోదీ సూచించారు. అంతే కాకుండా ఈ ప్రోగ్రాం లో భాగంగా ప్రధాన ఉద్దేశ్యం అయిన వెనుకబడిన ప్రాంతాలను డెవలప్ చేయడమే లక్ష్యంగా మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా 100 ఎక్కువగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని అధికారులకు ప్రధాని మోదీ ఆదేశించారు. ఇందుకోసం అధికారులు అంతా కష్టపడి పని చేయాలని ఉన్నతాధికారులకు మోదీ పిలుపునివ్వడం జరిగింది. అంతే కాకుండా ఇందులో మంచి ఫలితాలను సాధించి, వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని మోదీ తెలియచేశారు. ఇక ఇదంతా కూడా త్వరలోనే దేశమంతటా ఎన్నికలు జరగనుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పరంగా మంచి కార్యక్రమాలు చేసి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

కాగా ఈసారి జరుగనున్న ఎన్నికలలో బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ కలిసి ఒక కూటమి గా ఏర్పడి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news