మణిపూర్ విషయంపై రేపు పార్లమెంట్ లో మోదీ ప్రసంగం … !

-

ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో జరిగిన హింస వలన దేశం అంతటా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని విపక్షాల కూటమి హైలైట్ చేసింది. కాగా ఈ రోజు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా మణిపూర్ అంశంపైనా మాట్లాడారు. కాగా ఇదే విషయంపై రేపు పార్లమెంట్ లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కాగా విపక్షాలు ఈటెలలలాంటి మాటలతో గుచ్చినట్లు ప్రశ్నింస్తుంటే … వీటిపైన ఏ విధంగా మోదీ సమాధానాలు ఇవ్వనున్నారన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. అయితే కొంతమేరకు ఈ రోజు లోక్ సభలో అమిత్ షా మణిపూర్ అంశమై మాట్లాడినా పూర్తి కాలేదు. దీనితో తర్వాత ప్రసంగాన్ని రేపు కంటిన్యూ చేయనున్నారు.

మొత్తానికి రేపు పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం చోటు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక స్పీకర్ ఓం బిర్లా మళ్ళీ సభను ఆర్డర్ లో పెట్టడానికి మళ్ళీ కోపం తెచ్చుకుని వెళ్ళిపోతారు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news