కిసాన్ డ్రోన్లు ప్రారంభించిన మోదీ.. వచ్చే రెండేళ్లలో లక్ష డ్రోన్ల తయారీ..

-

రైతులకు సహాయపడే లక్ష్యంతో.. పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేసేందుకు కిసాన్ డ్రోన్ల కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈరోజు వివిధ నగరాల్లో పట్టణాల్లో 100 కిసాన్ డ్రోెన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రాబోయే రెండేళ్లలో గరుడు ఏరోస్పెస్ కింద లక్ష మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పీఎం మోదీ అన్నారు. ఇది యువతకు కొత్త ఉపాధి,  కొత్త అవకాశాలను తీసుకువస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 21 శతాబ్ధపు ఆధునిక వ్యవసాయ సౌకర్యాల దిశలో ఇది కొత్త అధ్యాయం అని ఆయన అన్నారు. ఈ రంగంలో అపరిమిత అవకాశాలు వస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో పాటు.. టెక్నాలజీని వాడుకునేందుకు కేంద్రం పలు కార్యక్రమాలను తీసుకువస్తోంది. దీంట్లో భాగంగానే ఇటీవల కేంద్ర బడ్జెట్ లో వీటికి అధిక నిధులు కేటాయించింది. ముఖ్యంగా డ్రోన్ల వినియోగానికి పెద్దపీట వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news