70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ట్విట్టర్ పాలోవర్స్ 70 మిలియన్ మార్క్ దాటారు. ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. రాజకీయ ప్రసంగాలతో మోదీ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. దేశ ప్రజలకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ వేదికగా మోదీ మంచి మెసెజ్సులు పంపుతుంటుంటారు.

2009లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 2010లో లక్ష మంది ఫాలోవర్స్ అయ్యారు. 2011 నవంబర్‌లో మోదీ ఫాలోవర్స్ సంఖ్య 4 లక్షలకు చేరింది. ఆ తర్వాత మోదీ ప్రధాని అయిన తర్వాత ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. దేశ ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకుంటున్నారు. సందేశాలతో పాటు సూచనలు కూడా ట్విట్టర్ వేదికగా మోదీ చేస్తుంటారు.