ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనలో కేసులు నమోదవుతున్నాయి. ఫిరోజ్ పూర్ జిల్లా.. కుల్గారి పోలీస్ స్టేషన్ పరిధిలో 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 283 కింద ఈ కేసులు నమోదు చేశారు.
ఇటీవల పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ప్రధాని మోదీ కాన్వాయ్ ని ఆందోళకారులు అడ్డగించారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లైవర్ పై ఉండాల్సి వచ్చింది. ప్రధాని లాంటి వ్యక్తి భద్రతలో పంజాబ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈవ్యవహరంపై ప్రతి విమర్శలు చేస్తోంది.
ఇదిలా ఉంటే ప్రధాన మోదీ భద్రతపై సుప్రీం కోర్ట్ లో కూడా పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. సుప్రీం కోర్ట్ పంజాబ్ ప్రభుత్వంతో పాటు, కేంద్రానికి కూడా కీలక ఆదేశాాలు జారీ చేసింది. ప్రధాని పర్యటనకు సంబంధించిన విషయాలను అన్నింటిని భద్రపరచాలని ఆదేశించింది.