క‌రోనా వైర‌స్ పై దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ సూచ‌న‌లు..!

-

క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జలంద‌రూ తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం కరోనా వైర‌స్ బాధితుల సంఖ్య 70 దాటింది. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా 4600కు పైగా క‌రోనా వ్యాధిగ్ర‌స్తులు చ‌నిపోయారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో క‌రోనా వైర‌స్ పట్ల ట్వీట్ చేశారు.

pm modi tweeted about corona safety for people

క‌రోనాపై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. క‌రోనా వైర‌స్ రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుందామ‌ని, క‌రోనాను త‌రిమేద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లు ఒకే చోట గుమిగూడ‌కూడ‌ద‌ని మోదీ అన్నారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. వీలైనంత వ‌ర‌కు ప్ర‌జ‌లు ప్ర‌యాణాల‌ను త‌గ్గించాల‌ని అన్నారు. అలాగే కొంత‌కాలం పాటు మంత్రులెవ‌రూ విదేశాల్లో ప‌ర్య‌టించ‌ర‌ని తెలిపారు.

క‌రోనాను అడ్డుకునేందుకు కేంద్రం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. అందులో భాగంగానే ప‌ర్యాట‌క వీసాలు ర‌ద్దు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌లు కరోనా వైర‌స్ ప‌ట్ల భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news