బిడెన్ కి ఫోన్ చేసిన మోడీ, ఎందుకంటే…!

-

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసారు. తాను బిడెన్ తో మాట్లాడా అని మోడీ స్వయంగా ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బిడెన్ మాట్లాడిన మొదటి దేశాధినేత మోదినే కావడం విశేషం. ఈ మేరకు మోడీ ఒక ట్వీట్‌ లో చేసారు. “అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌ ను అభినందించడానికి ఫోన్‌  చేసాను.PM Modi speaks to Joe Biden, wishes Kamala Harris; discusses Covid-19 pandemic, climate change - india news - Hindustan Times

ఇండో-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మా ధృడమైన నిబద్ధతను ఈ సమావేశంలో స్పష్టం చేసాం. మన భాగస్వామ్య ప్రాధాన్యతలు మరియు ఆందోళనలను చర్చించాము. కోవిడ్ -19 మహమ్మారి, వాతావరణ మార్పు , మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం గురించి చర్చించామని మోడీ చెప్పారు. కమలా హారిస్ కి కూడా తాను అభినందనలు చెప్పా అని మోడీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news