టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి… చల్లా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పార్టీలోని సీనియర్లు. అలాగే జూనియర్లు అనే తేడా లేకుండా… అందర్నీ కలుపుకుంటూ రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల్లోని నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలంగాణలోని జిల్లాల్లో.. పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభ్యత్వ నమోదు తో పాటు స్థానికంగా పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు తదితర వాటిపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తన పర్యటన దోహదం చేస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మరో వారం రోజుల్లోనే.. జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే ఈ కార్యచరణ కు శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.