డ్రగ్స్ కేసులో పట్టుబడిన మోహిత్‌ను ఒక రోజు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రాంగోపాల్ పేట్ పోలీసులు మోహిత్‌ను ఇవాళ ఉదయం 10గంటలకు కస్టడీలోకి తీసుకొని.. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. మోహిత్‌కు దాదాపు 50 మంది ప్రముఖులతో పరిచయాలున్నట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి సెల్ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్‌ను సేకరించారు. మోహిత్‌ను ప్రశ్నించడం ద్వారా వాళ్లతో అతనికి ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ నటి నేహా దేశ్‌పాండే భర్త అయిన మోహిత్ ఇంటర్నేషనల్ డీజే నిర్వాహకుడిగా కూడా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పలు పబ్బులలో పార్టీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో గోవా మాదక ద్రవ్యాల స్మగ్లర్ ఎడ్విన్‌ను అరెస్ట్ చేసినప్పుడు మోహిత్ బండారం బయటపడింది. ఎడ్విన్ ద్వారా మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన మోహిత్ వాటిని పబ్బులలో సరఫరా చేసినట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు ఆరోపిస్తున్నారు.