శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని టీటీడీ తెలిపింది. మరోవైపు ఆలయంలో శ్రీవారి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
శ్రీవారి ఆలయంలో 25 రోజులపాటు జరగనున్న అధ్యయనోత్సవాలు ఈనెల 3వ తేదీ రాత్రి ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేశారు.