గత రెండు రోజులుగా మన హైదరాబాద్ లో వర్షం ఏ రేంజ్ లోన్ దంచికొడుతుందో అందరికి తెలిసిందే. మంగళవారం రాత్రి మొదలైన అస్సలు విరామం లేకుండ కురుస్తుూనే ఉంది. ఈ వర్షం దెబ్బకి నగరం మొత్తం జలమయం అయ్యింది. సిటీ లోని రోడ్లు నదులను తలపిస్తున్నాయి.నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు తంటాలు పడుతున్నారు. వర్షాల వల్ల నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఒకే టైమింగ్‌లో కాకుండా 3 దశల వారీగా లాగ్ ఔట్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని.. ఐకియా నుండి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ కావాలని సూచించారు. అంతేకాకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీస్ శాఖ .ఆదేశాలు జారీ చేసింది. ఇలా అయితే ట్రాఫిక్ సమస్య తగ్గుతోందని వెల్లడించారు పోలీసులు . అందరూ ఒకే సమయంలో లాగ్ ఔట్ రోడ్లపైకి రావడం వల్ల ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని పోలీసులు అన్నారు.