కొప్పోలు బాలిక హత్య కేసులో సంచలన విషయాలు

నల్గొండ: పీతి మృతి కేసు సంచలనం సృష్టించింది. నిందితులు పవన్, రాజు సంభాషణ ఆడియో వైరల్ అయింది. కొప్పొలులో బాలిక హత్యకు ముందు పవన్ ఫోన్ సంభాషణ తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికను చంపేస్తానంటూ స్నేహితుడు రాజుకు పవన్ ఫోన్ చేయగా వచ్చి మాట్లాడతానని రాజు వారించారు. ఫోన్ సంభాషణ కంటే ముందే బాలికపై పవన్ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేతేపల్లి మండలం కొప్పులు గ్రామానికి చెందిన ప్రీతి నల్గొండలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఓకేషనల్ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటోంది. ప్రీతి ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ప్రీతి అదే గ్రామానికి సమీప బంధువు పవన్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. ప్రీతి నల్గొండలో మరొకరితో సఖ్యత ఉంటోందని పవన్ అనుమానం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రీతిని దూరం పెడుతూ వచ్చాడు.

ఈ నెల 12వ తేదీనే ఇంట్లో నిద్రిస్తున్న ప్రీతిని అర్ధరాత్రి తర్వాత పవన్ ఫోన్ చేసి బయటకు పిలిచాడు. అక్కడ నుంచి గ్రామ శివారులోని వ్యవసాయ భూములోకి తీసుకెళ్లాడు. అక్కడ పవన్ మద్యం సేవించి ప్రీతితో గొడవ పడ్డాడు. అనంతరం తన స్నేహితుడైన సూర్యాపేట మండలం కొప్పిరెడ్డి గూడేనాకి చెందిన రాజుకు ఫోన్ చేసి ప్రీతిని హత్య చేస్తున్నట్లు చెప్పాడు. వెంటనే రాజుతో పాటు మరో ఇద్దరు స్నేహితులు తాము వస్తున్నామని ప్రీతిని హత్య చేయొద్దని చెప్పారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్ ప్రీతి మెడకు చెన్నీ బిగించి హత్య చేశాడు. కాసేపటికే రాజు, అతడి స్నేహితుడు కొప్పులు వచ్చి ఫోన్ చేశారు. అప్పటికే ప్రీతిని చంపినట్లు పవన్ చెప్పాడంతో వెను దిరిగారు.

 

తమ కుమార్తెతో చనువుగా ఉంటున్న పవన్‌ హత్య చేసి ఉంటాడని ప్రీతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం కావడంతో ఎస్పీ రంగనాథ్ ప్రీతి మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ప్రీతి మెడకు చున్నీతో బిగించి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పవన్‌ను అదుపులోకి విచారించడంతో నేరం అంగీకరించాడు. ఈ హత్యను దాచిన పవన్ స్నేహితులు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం.