మద్యం కోసం నడిరోడ్డుపై పోలీసుల కొట్లాట.. వీడియో వైరల్

-

రెండు వర్గాల మధ్య ఏదైనా వివాదం చెలరేగినా, గొడవలు చెలరేగినా.. వాటి పరిష్కారం కోసం పోలీసుల్ని పిలిపిస్తాం. కానీ ఆ పోలీసుల మధ్య గొడవలు ఏర్పడితే? అలాంటి పరిణామమే ఉత్తరప్రదేశ్ లోని రాంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హోంగార్డు, కానిస్టేబుల్ లు నడిరోడ్డుపై నువ్వా – నేనా అన్న విధంగా కాలర్లు పట్టుకుని కొట్లాడుకున్నారు. ఆగస్టు 28వ తేదీన కానిస్టేబుల్ ధరంవీర్ సింగ్, హోంగార్డు సునీల్ కుమార్ తో పాటు మరో కానిస్టేబుల్ కలిసి జగమ్మన్ పూర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు.

అయితే ధరంవీర్ సింగ్, సునీల్ కుమార్ మధ్య మద్యం విషయంలో వివాదం తలెత్తింది. ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఆ తర్వాత కొట్టుకున్నారు. కానిస్టేబుల్, హోంగార్డును రోడ్డుపై పడేసి కొట్టాడు. కాళ్లతో తంతూ చితకబాదాడు. ఈ వివాదాన్ని ఆపేందుకు మరో కానిస్టేబుల్ ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను రోడ్డుపై వెళుతున్న వాహనదారులు వారి మొబైల్ ఫోనులో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో జలాన్ ఎస్పి రవికుమార్ దృష్టికి వెళ్ళింది. దీంతో వారిద్దరిని విధులనుంచి తొలగించారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news