శ్రీకాళహస్తి రాయుడి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రాయుడి హత్య కేసులో కీలక ఆధారాలు లభించాయి. రాయుడిని కాళహస్తిలోనే చంపి మృతదేహాన్ని సొంత కారులో వినుత, చంద్రబాబు తీసుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. దారి మధ్యలో మృతదేహాన్ని మరో వాహనంలోకి మార్చారు నిందితులు. మృతదేహాన్ని తరలించిన వాహనాన్ని సీజ్ చేశారు చెన్నై పోలీసులు.
ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ కోట వినుతపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ కోట వినుతను పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. జనసేన కార్యకర్త రాయుడు విషయంలో పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరించారంటూ జనసేన వివరణ ఇచ్చింది. అనుమానాస్పద స్థితిలో జనసేన కార్యకర్త మృతి చెందాడు. ఈ తరుణంలోనే రాయుడి హత్యకేసులో వినుత, ఆమె భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు.