వనపర్తిలో పోలీసుల ఓవర్ యాక్షన్, కొడుకు ముందే తండ్రిపై దాడి…!

-

కరోనా లాక్ డౌన్ సమయంలో కొందరు పోలీసుల వ్యవహారశైలిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు పోలీసులు దాడులు చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. లాక్ డౌన్ ని అమలు చేయకపోయినా పాటించకపోయినా సరే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. తాజాగా తెలంగాణాలోని వనపర్తిలో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు.

ఒక్క మాటలో చెప్పాలి అంటే ఓవర్ యాక్షన్ చేసారు. తండ్రీ కొడుకులు బయటకు రాగా 11 ఏళ్ళ కొడుకు ముందే పోలీసులు తండ్రిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తమ తండ్రిని కొట్టవద్దు అని బాలుడు వేడుకున్నా సరే ఇష్టం వచ్చినట్టు దాడి చేసాడు కానిస్టేబుల్ అశోక్. ఆ అడ్డు వస్తున్నా సరే అతను ఆగకుండా అతనిపై దాడి చేసాడు. అసభ్య పదజాలం తో అతన్ని దూశించాడు అశోక్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఘటనపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసారు. ఎస్పీ కి ఈ మేరకు ఆదేశాలు అందాయి. వెంటనే కానిస్టేబుల్ అశోక్ ని ఎస్పీ సస్పెండ్ చేసారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాట వినకపోతే మీ ఇష్టం వచ్చినట్టు కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చాలా బాధాకరం నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో కన్న కొడుకు ముందు లాఠీలతో బాదుతున్న ద్రుశ్యం హ్రుదయ విదారకంగ ఉంది.Note:-…

Posted by Lakshmi Narayana on Wednesday, 1 April 2020

Read more RELATED
Recommended to you

Latest news