ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 135 కి చేరుకుంది. ఉదయం నుంచి కరోనా విషయ౦లో అలజడి మరింత పెరిగింది. రాత్రి 111 ఉన్న కరోనా కేసులు ఉదయం 132 కి చేరాయి. దీనితో ప్రభుత్వంలో కూడా ఆందోళన మొదలయింది. కరోనా మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వేగంగా విస్తరిస్తుంది. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
రాబోయే రెండు రోజుల్లో ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఏపీలో ఇప్పటి వరకు ఎవరూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోలేదు. ఇక ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఉదయం ప్రధానితో నిర్వహించిన సమావేశంలో వైఎస్ జగన్ తమకు కేంద్ర సహాయం కావాలని కోరారు.
ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ని పొడిగించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచి వైరస్ విస్తరిస్తుందని కాబట్టి ఇప్పుడు లాక్ డౌన్ ని ఎత్తేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఏపీ లో లాక్ డౌన్ ఎత్తేసే సూచనలు కనపడటం లేదు. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది.