వామ్మో.. మోచేయంత అరటి పండు..!

-

పూర్వం భూమిలో ఉంటే సారంతో కూరగాయలు, పండ్ల పెద్ద సైజులుగా ఉండేవని మన పెద్దలు చెప్పేవాళ్లు. కాలం గడిచే కొద్దీ వాటి సైజ్ తగ్గుతూ వచ్చాయని, భూమిలో రసాయనాలు వాడటం వల్ల కూరగాయలు, పండ్లల్లో నాణ్యత, వాటి పరిమాణం తగ్గుతూ వచ్చాయి. భారీ సైజులో ఉన్న కొన్ని కూరగాయ పంటలను, ఫ్రూట్స్‌ను చూసి ప్రస్తుతం తరం యువతీయువకులు ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

banana
banana

ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మహిళ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోను చూసినట్లయితే ఏకంగా తన మోచేయి అంత పెద్దదైన అరటి పండు ఉంటుంది. అది చూసిన నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఒక పండును తింటే ఇక రోజంతా పస్తులున్నా నడుస్తుందని తెలుపుతున్నారు.

ఇంగ్లాండ్‌కు చెందిన పౌలా (45 ఏళ్లు) ఇంట్లో నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్‌లో ఇంటికి సరపడా నిత్యావసరాలు, ఫ్రూట్స్ కొనుగోలు చేసుకుని ఇంటికి వచ్చింది. అయితే.. ఇంటికి వచ్చి సామన్లు చూసుకున్నప్పుడు ఒక్కసారిగా ఆమె షాక్‌కి గురైంది. అందులో ఒక అరటి పండు చాలా పెద్దగా కనిపించింది. మామూలు అరటి పండు కన్నా.. 2, 3 రెట్లు పెద్దగా ఉందని తెలిపింది. 12 అంగుళాలు ఉన్న అరటి పండు చాలా రుచికరంగా ఉందని ఆమె పేర్కొంది. పౌలా కొడుకు సమ్మీ ఇద్దరూ కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. ఇంటికి రాగానే స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన కొడుకుకి పౌలా అరటి పండును చూపించింది. దీంతో సమ్మీ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు.

అరటి పండును చూసిన పౌలా దాన్ని ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇంత పెద్ద సైజులో అరటి పండును చూసి పరిశోధకులు.. అరటిపండుకు రోజువారీ పొటాషియం అందాల్సిన దానికంటే ఎక్కువగా అందడం వల్ల సైజు పెరిగిందని వారు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news