ప్రశాంత్ కిషోర్ బృందంతో సీఎం కేసీఆర్ భేటీ !

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్‌ హాట్‌ గా నడుస్తున్నాయి. హుజురాబాద్‌ ఓటమి అనంతరం… వడ్ల పంచాయితీ పేరుతో… కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు గులాడీ బాస్‌ సీఎం కేసీఆర్‌. అంతేకాదు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండకూడదని.. వారిని ఓడిస్తే… ప్రజలు, రైతులకు న్యాయం జరుగుతుందని… స్టేట్‌ మెంట్లు కూడా ఇస్తున్నారు సీఎం కేసీఆర్.

అయితే.. ఇలాంటి కామెంట్లు చేయడం కేసీఆర్‌ కు కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఆయన నిజంగానే.. కేంద్రంపై యుద్దం చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే… రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవాలని గులాబీ బాస్‌ ఆలోచన చేస్తున్నారట. అంతే కాదు.. గత కొన్ని రోజులుగా ప్రశాంత్‌ కిషోర్‌ బృందంతో సీఎం కేసీఆర్‌ సంప్రదింపులు కూడా జరిపుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది.

త్వరలోనే.. ప్రశాంత్‌ కిషోర్‌ తో డైరెక్ట్‌ గా కేసీఆర్‌ సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తోంది. ఎలాగైనా… కేంద్రంలో బీజేపీ పార్టీని నిలువరించేందుకు… ఎవరితోనైనా… జత కట్టడానికి సీఎం కేసీఆర్‌ అనుకుంటున్నారట. అలాగే.. ప్రశాంత్‌ కిషోర్‌ సేవలు ఉపయోగించుకుని మరోసారి… తెలంగాణలో అధికారం చేపట్టాలని.. కేసీఆర్‌ భావిస్తున్నారట. అయితే..వీరిద్దరి కలయికపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news