వరుణ్‌గాంధీ కాంగ్రెస్ భాషను వాడుతున్నారు: ఎంపీ హరనాథ్ సింగ్

-

ఎంపీ వరుణ్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ భాషను వాడుతున్నారని రాజ్యసభ సభ్యుడు హరనాథ్ సింగ్ యాదవ్ ఆరోపించారు. ఆయన లోపల నైతిక ఉంటే, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలనే ఆలోచనల ఉంటే, కాంగ్రెస్ లేదా ఏదైనా పార్టీలో చేరవచ్చని సూచించారు. తక్షణమే వరుణ్‌గాంధీ బీజేపీ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండు చేశారు. లక్నోలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ విషయమై వరుణ్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వైఖరిని నిరిసిస్తూ సొంత పార్టీ ఎంపీనే విమర్శలకు దిగడం గమనార్హం.

భారతీయ జనతా పార్టీని, క్షమశిక్షణను వరుణ్ గాంధీ గౌరవించాలి. బీజేపీలో ఉన్నంతకాలం ఆయన బీజేపీ క్రమశిక్షణను అనుసరించాలి అని హరనాథ్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.

లక్నోలో లాఠీచార్జీ వీడియోను చేసిన వరుణ్‌గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. వీరు కూడా భారత మాత బిడ్డలే. వారి డిమాండ్లను అంగీకరించడం మరిచిపోయారు. వారి మటలను వినడానికి ఏ ఒక్కరూ లేరు. పైగా వారిపై క్రూరంగా లాఠీచార్జీ జరిపారని వరుణ్‌గాంధీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news