సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు పనిచేయడం లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయాయట. వాటిని ఇంజినీర్లు సెట్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో క్యూలైన్లలో ఉన్న ఓటర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అటు అధికారులకు కూడా ఈవీఎంలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల పోలింగ్ ఆగిపోయింది. దీంతో ఓటర్లు ఓటేయకుండానే వెనుదిరిగారు.
సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు పనిచేయడం లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయాయట. వాటిని ఇంజినీర్లు సెట్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
అయితే.. ఈవీఎంల మొరాయింపుపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 157 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ టీడీపీ డిమాండ్ చేసింది. దీనిపై టీడీపీ ప్రతినిధులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలు పనితీరు సరిగ్గా లేకపోవడం ఓటింగ్ శాతంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాళ్లు తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని… ఆచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అయితే.. పోలింగ్ లేట్ అయిన దగ్గర పోలింగ్ సమయం పెంచేందుకు ఈసీ నిరాకరించింది.