హిందుత్వ, విజభన రాజకీయాలతోనే బీజేపీ గెలిచింది: అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ సీఎం

-

5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం గురించి ఆ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కనీస స్థితిలో పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆ పార్టీ సీనియర్లు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ఇంట్లో పార్టీ సీనియర్లు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పరాజయంతో కలత చెందానని ఆజాద్ అన్నారు.

 

ఇదిలా ఉంటే రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ మాత్రం బీజేపీ తప్పుడు మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. హిందుత్వ, విజభన రాజకీయాలతోనే బీజేపీ గెలిచిందని ఆయన విమర్శించారు. యూపీలో కోవిడ్ మేనేజ్మెంట్ గురించి అందరికీ తెలుసని.. కానీ బీజేపీ తెలివిగా మాట్లాడటం వల్ల ప్రతిపక్షాలు వెనకపడ్డాయని… ఇది ప్రజల ఆలోచనను మార్చేసిందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ తెలివిగా మాట్లాడుతున్నారని.. ఈరోజు దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూస్తుందని.. ఈడీ, సీబీఐ, ఐటీ ల ద్వారా దాడులు చేయిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మనం నిజాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అశోక్ గెహ్లాట్ అన్నారు. అప్పుడు బీజేపీ నిజస్వరూపం బట్టబయలు అవుతుందని.. మనం గాంధీ మార్గంలో పోరాటం చేయాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ చత్తీస్గడ్, రాజస్థాన్ లో మాత్రమే అధికారంలో ఉంది. జార్ఖండ్ లో మిత్ర పక్షంతో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news