టీఆర్ఎస్ ఆర్ధిక మూలాలపై దెబ్బ..సేమ్ టీడీపీ సీన్.!

2019 ఎన్నికల ముందు ఏపీలో ఎలాంటి సీన్ ఉందో..సేమ్ సీన్ ఇప్పుడు తెలంగాణలో ఉందో. అప్పుడు కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఏపీలో అధికారంలో చంద్రబాబు ఓ రేంజ్‌లో విమర్శలు చేయడం, పోరాటం చేయడం చేశారు. మోదీని గద్దె దించాలని చెప్పి విపక్ష పార్టీలని ఏకం చేశారు..ఆఖరికి కాంగ్రెస్ పార్టీతో కూడా కలిశారు.

ఇటు కేసీఆర్ సైతం…ఇప్పుడు మోదీ సర్కార్‌పై పోరాడుతున్నారు..సేమ్ బాబు మాదిరిగానే విపక్ష పార్టీలని ఏకం చేయాలని చూస్తున్నారు..కాకపోతే టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో కీలకం అవ్వాలని చూస్తున్నారు. ఇక టీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…తమ అధికారాలని ఉపయోగించి ఏపీలో ఉన్న టీడీపీని భారీ దెబ్బకొట్టింది.

ఎన్నికల ముందు ఐటీ, ఈడీ రైడ్స్ నడిచాయి..టీడీపీ నేతల వ్యాపారాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఆఖరికి చంద్రబాబు సి‌బి‌ఐ రాకుండా జీవో కూడా పెట్టుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహించే అధికారులు, పోలీస్ వ్యవస్థ, ఇంకా ఇతర వ్యవస్థలు టీడీపీకి యాంటీగా మారాయి. అలాగే టీడీపీ ఆర్ధిక మూలాలని భారీగా దెబ్బతీశారు. దీంతో ఎన్నికల సమయంలో టీడీపీ అనుకున్న స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయింది..ఇక తమకు బలం లేకపోవడంతో బీజేపీ..పరోక్షంగా వైసీపీకి సహకరించింది. దీంతో బాబు చిత్తుగా ఓడిపోయారు.

ఇప్పుడు సేమ్ సీన్ తెలంగాణలో కనిపిస్తోంది..మోదీ, అమిత్ షా, బీజేపీ లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేసీఆర్‌కు చెక్ పెట్టేలా కేంద్రం ముందుకెళుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఐటీ, ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అటు చంద్రబాబు లాగా రాష్ట్రనికి సి‌బి‌ఐని రాకుండా కేసీఆర్ జీవో పాస్ చేశారు. కానీ టీఆర్ఎస్ నేతల వ్యాపారాలు, లిక్కర్ స్కామ్, క్యాసినో వ్యవహారాల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్ధికంగా బలంగా ఉన్న మల్లారెడ్డి టార్గెట్ గా రైడ్స్ నడుస్తున్నాయి. అసలు టోటల్ గా టీఆర్ఎస్ ఆర్ధిక మూలాలని దెబ్బకొట్టి, ఎన్నికల సమయంలో ఆర్ధికంగా పోల్ మేనేజ్‌మెంట్ చేయనివ్వకుండా అడ్డుకునేలా కేంద్రం స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. మరి చూడాలి కేంద్రం చేతిలో కేసీఆర్ కూడా బాబు మాదిరిగా బలి అవుతారో..లేక రివర్స్  అవుతారో.