ప్రాంతీయ పార్టీల్లో ఉంటే ఒకే ప్రాంతానికి తాము పరిమితమవుతామని.. అందుకే తాను జాతీయ పార్టీలో చేరినట్లు మాధవీలత వెల్లడించారు. ఏపీలో నైతిక విలువలున్న పార్టీలేవీ లేవు. నా కుటుంబానికి చాలా దగ్గరైన పార్టీ బీజేపీ. అందుకే బీజేపీలో చేరా.. అని మాధవీలత అన్నారు.
నాకు ఎన్నికలు, పదవులు ముఖ్యం కాదు. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటా. ప్రజల మధ్యే ఉంటా. ప్రజా సమస్యలను అర్థం చేసుకునే మనసుంటే రాజకీయాల్లో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. ఉన్నత చదువులు చదువుకున్న నాకు ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలుసు. నేను ఇక్కడి నాయకుల్లాగ బీకాంలో ఫిజిక్స్ ఏమీ చదువుకోలేదు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, బీజేపీ అభ్యర్థి మాధవీలత.
తను బీజేపీ తరుపున గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక.. తను ఓటర్లను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకులపై విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. తన నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో రోడ్‌షో చేస్తూ ప్రజలకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రాంతీయ పార్టీల్లో ఉంటే ఒకే ప్రాంతానికి తాము పరిమితమవుతామని.. అందుకే తాను జాతీయ పార్టీలో చేరినట్లు మాధవీలత వెల్లడించారు. ఏపీలో నైతిక విలువలున్న పార్టీలేవీ లేవు. నా కుటుంబానికి చాలా దగ్గరైన పార్టీ బీజేపీ. అందుకే బీజేపీలో చేరా.. అని మాధవీలత అన్నారు.
ఏపీలోని అన్ని జిల్లాల కన్నా గుంటూరు రాజకీయాలకు ప్రత్యేకత ఉంది. నాకు అన్నివిధాలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సహాయసహకారాలు అందిస్తున్నారు. నాకు ప్రజాక్షేత్రంలో ఎటువంటి ఇబ్బంది ఎదురు అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉంది. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్లంతా మంచివాళ్లే. వాళ్లు ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తారు తప్పితే.. దోచుకోవడం కోసం మాత్రం కాదు. నేను 2014లోనే రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్నా. అయితే.. అప్పటికి నాకు రాజకీయాలపై అవగాహన లేదు. అందుకే.. రాజకీయాలపై అవగాహన పెంచుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మాధవీలత వెల్లడించారు.