వామన్ రావు దంపతుల హత్య కేసు..గుడి గొడవ ముసుగులో మరో కుట్ర దాగుందా ?

Join Our Community
follow manalokam on social media

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు ఆలయ వివాదమే కారణమా లేక గుడి గొడవ ముసుగులో మరో కుట్ర దాగుందా అన్న అంశాల పై దృష్టి పెట్టారు పోలీసులు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..బిట్టు శ్రీను అనే మరో నిందితుణ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో బిట్టు శ్రీనుకు కూడా భాగం ఉన్నట్టు..పోలీసులు చెబుతున్నారు. మర్డర్‌ చేసేందుకు ఆయుధాల్ని సప్లయ్‌ చేసింది ఇతడేనని నిర్ధారించారు.వామన్ రావు హత్య వెనక ఉన్న పెద్దలెవరు ఇప్పుడీ కేసులో ఈ అంశాలపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు.

న్యాయవాది దంపతుల హత్యకేసులో దర్యాప్తువేగం పెంచారు పోలీసులు. ఇప్పటికే ముగ్గుర్ని అరెస్టు కాగా… మరో నిందితుడు బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ రవీందర్‌ తెలిపారు. న్యాయవాదుల హత్య కోసం..వాహనం, ఆయుధాలు సమకూర్చినట్లు బిట్టు శ్రీనుపై అభియోగాలు ఉన్నాయి. ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌కు కారు ఇవ్వడంతోపాటు, హత్యకు వినియోగించిన రెండు కత్తులనూ బిట్టుశ్రీనే సమకూర్చాడని పోలీసులు నిర్ధరించారు. బిట్టు శ్రీను పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుకర్‌కు స్వయానా మేనల్లుడు కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

వామన్‌రావు దంపతలు హత్యకు ఉపయోగించిన కత్తుల్ని మంథనిలో ఓ పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఆ దుకాణం ఓ ప్రజాప్రతినిధికి చెందినదిగా తెలిసింది. ఆ ప్రజాప్రతినిధిని విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిట్టు శ్రీనివాస్‌ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

మంథని మాజీ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు స్వయానా మేనల్లుడైన బిట్టు శ్రీనుకు నేరచరిత్ర పెద్దగానే ఉంది. పుట్ట మధు తన తల్లి లింగమ్మ పేరిట నిర్వహించే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న బిట్టు శ్రీను. పలు కేసుల కారణంగా.. బిట్టు శీనుపై గతంలోనే రౌడీషీట్‌ నమోదైంది. పుట్ట మధు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాక.. శీను పై ఉన్న రౌడీషీట్ తొలగించారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి దందాలోనూ బిట్టు శ్రీను మామూళ్లు వసూలు చేస్తుండటాడనీ… మంథనిలో జరిగే ప్రతి సెటిల్మెంట్లో బిట్టు శీను ప్రమేయం ఉంటుందనీ ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో బిట్టు శీను ఆరితేరాడనే అభియోగాలున్నాయి.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....