ఎన్నిక‌ల త‌ర్వాతే తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం!

-

క‌రోనా తెలంగాణ‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 10వేల మార్కును తొలిసారి దాటింది. అంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌ర‌ణాలు కూడా విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. క‌రీంన‌గ‌ర్ లో ముందే చితిపేర్చి రెడీ పెడుతున్నారంటే.. క‌రోనా మ‌ర‌ణ మృదంగం ఎలా ఉందో తెలుస్తోంది. ఇలాంటి టైమ్ లో స‌ర్కారు నుంచి ఎలాంటి ఆదేశాల రావ‌ట్లేద‌నేది పెద్ద సందేహంగా మారింది. ఎందుకంటే పొరుగునే ఉన్న కేర‌ళ‌, త‌మిళ‌నాడులో మినీ లాక్ డౌన్ ల ప్ర‌క‌టించారు.

ఇక క‌ర్ణాట‌క‌లో అయితే 12వేల కేసులు వ‌చ్చాయ‌ని ఏకంగా 15రోజుల కంప్లీట్ లాక్ డౌన్ పెట్టేశారు.
అటు మ‌హారాష్ట్ర‌లో ఎప్ప‌టి నుంచో నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ నుంచి లాక్ డౌన్ వ‌ర‌కు ఆంక్ష‌లు న‌డుస్తూనే ఉన్నాయి. ఇవ‌న్నీ తెలంగాణ‌తో బార్డ‌ర్ ఉన్న రాష్ట్రాలు కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్పుడ తెలంగాణ‌లో కూడా ఇత‌ర రాష్ట్రాల్లాగే కేసులు వ‌స్తున్నా.. ఎందుకు మౌనంగా ఉంటున్నార‌నేది రాష్ట్ర ప్ర‌జ‌ల ఆగ్ర‌హం. ఇక ఇప్పుడు న‌డుస్తున్న నైట్ క‌ర్ఫ్యూ కూడా హై కోర్టు గ‌ట్టిగా ఆదేశాలిస్తేనే పెట్టారు.

ఇప్పుడు కోర్టు మ‌ళ్లీ ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తోంది. కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతుంటే ఏం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. వెంట‌నే ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోక‌పోతే తామే ఆదేశాలు ఇస్తామంటూ హెచ్చ‌రిస్తోంది. అయినా దీనిపై అధికారులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఇందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మినీ పుర‌పోరు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటికి ఈ నెల 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే3న ఫ‌లితాలు విడుద‌ల అవుతాయి. కాబ‌ట్టి ఈ టైమ్ లో లాక్ డౌన్ పెడితే ఎల‌క్ష‌న్లు ఆగిపోతాయి కాబ‌ట్టి.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాతే లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకోవాలని కేసీఆర్ టీమ్ భావిస్తోంద‌ని తెలుస్తోంది. ఇప్పుడు జ‌రుగుతున్న అన్ని ఎన్నిక‌లు గులాబీ పార్టీకి ప‌ట్టున్న ఏరియాలు కావ‌డంతోనే ఎల‌క్ష‌న్లు జ‌ర‌పాత‌ని గులాబీ బాస్ భావిస్తున్నారంట‌. అంటే మే3 త‌ర్వాత ఏ టైమ్ లో అయినా లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news