యువ వయసులో ఉండే వాళ్ళకి గుండెపోట్లు ఎందుకు ఎక్కువయ్యాయి…?

-

గుండె సంబంధిత సమస్యల ద్వారా చాలా మంది మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం విశ్వ వ్యాప్తిమగా చూస్తుంటే 17.9 మిలియన్ల మంది మరణిస్తున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. హృదయ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు ఐదుగురిలో నలుగురు గుండె పోటు, స్ట్రోక్ కారణంగా మరణిస్తున్నారు. అయితే వీళ్ళల్లో 1 /3 శాతం 70 ఏళ్లు కంటే తక్కువ వయసు వాళ్లే అని యూనియన్ హెల్త్ ఏజెన్సీ చెప్పింది.

గత పది సంవత్సరాల నుంచి చూస్తుంటే… 40 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు గుండె పోటు తో మరణించడం 2 శాతం పెరిగిందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వెల్లడించింది. అయితే ఎందుకు యువ వయసులో ఉండే వాళ్ళు గుండెపోటుతో బాధపడుతున్నారు…? గుండె పోటు ఎందుకు వస్తుంది..?, దానికి గల కారణాలు ఏమిటి..? అనేది చూడాలి.

గుండెపోటు ఎలా వస్తుంది అనే విషయం చూస్తే…. హఠాత్తుగా గుండెకి రక్తం సప్లై అవ్వదు కొద్దిగా లేదా మొత్తానికి గుండె వరకు చేరుకోదు. దీని కారణంగా హఠాత్తుగా గుండెపోటు వస్తుంది. హృదయ సంబంధిత సమస్యలు యుక్త వయస్సు లో ఉండే వాళ్ళకి ఎక్కువైపోయాయి.

ఎలా తగ్గించుకోవాలి అంటే..? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతి రోజు వ్యాయామం చేయడం మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండడం ఇలా మంచి జీవన విధానాన్ని పాటించాలి.

అలానే ఇప్పుడు అందరు ఎక్కువ సమయాన్ని స్క్రీన్స్ ముందు గడుపుతున్నారు. ఈ జీవన విధానం కూడా మంచిది కాదు. విద్యార్థులు అయితే ఒత్తిడి తట్టుకోలేక డ్రగ్స్ వంటి వాటికి బానిసలవుతున్నారు. ఇలా ఈ కారణాల వలన కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైనవి, మంచివి అనుసరించాలి. దీనితో అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news