2019 సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినా కవిత ఓడిపోవడం జరిగింది. ఆ టైంలో కవితపై బిజెపి పార్టీ గెలవడం జరిగింది. దీంతో తెలంగాణలో బిజెపి పార్టీకి బలం పెరిగిందని అప్పట్లో చాలామంది మాట్లాడటం జరిగింది. ఈ ఓటమితో దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కవిత తాజాగా మళ్లీ ఇటీవల ఎమ్మెల్సీ గా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ముందుగా రాజ్యసభ నుండి తండ్రి కేసిఆర్, కవితని పెద్దల సభకు పంపిస్తారని పార్టీలో ఉన్న నాయకులూ అందరూ భావించిన తరుణంలో కవితా కి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో దాదాపు కవిత రాజకీయాలకు దూరం అవుతారని అందరూ భావించారు. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల నామినేషన్ వేసిన కవిత అతి త్వరలోనే ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవి చేపట్టడానికి అవుతున్నట్లు పార్టీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.
నామినేషన్ వేసిన తర్వాత కవితకి స్వయంగా ఈ శుభవార్త ని అన్నయ్య కేటీఆర్ చెప్పినట్లు టిఆర్ఎస్ పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే చాన్నాళ్ల తర్వాత మళ్ళీ కవిత యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టనున్నారు.