సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారీ అఖిలేశ్‌కే బాధ్యతలు

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ యాదవ్‌ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లఖ్‌నవూలోని రమాబాయ్ అంబేడ్కర్‌ మైదానంలో నిర్వహించిన పార్టీ జాతీయ సమావేశంలో సెక్రటరీ జనరల్‌ రామ్‌గోపాల్‌ యాదవ్‌ వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఒక్కరే ఉన్నందున అఖిలేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.

2017 జనవరిలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2017 అక్టోబరులో ఆగ్రాలో నిర్వహించిన పార్టీ జాతీయ సమావేశంలో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా మరో పర్యాయం పార్టీ నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.