ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులతో పాటు సామాన్య కార్యకర్తలకు కూడా ఆందోళన పెంచుతున్నాయి ఈసారి తెలంగాణ ఎన్నికలు. గత రెండుసార్లు ఏకపక్షంగా సాగిన ఎన్నికలు ఈసారి త్రిముఖ పోటీతో నాయకులందరికీ చుక్కలు చూపిస్తున్నాయి.
అంబర్ పేట నియోజకవర్గం లో బిఆర్ఎస్ నుంచి కాలేరు వెంకటేష్ పోటీ చేస్తున్నారు. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇతనికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అంతేకాకుండా అంబర్ పేటకు బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా తనని గెలిపిస్తాయని కాలేరు వెంకటేష్ ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రోహిన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నో మలుపుల తరువాత రోహిన్ రెడ్డికి ఈ టికెట్ దక్కింది. మరి కాంగ్రెస్ లోని ఆశావహులు రోహిన్ రెడ్డికి మద్దతు తెలుపుతారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. బిజెపి నుంచి కృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ టికెట్ కోసమే పార్టీ మారారు అన్న వార్తలు వినిపిస్తున్నా కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీలోకి చేరానని కృష్ణ యాదవ్ చెబుతున్నారు. పైగా ఇది కిషన్ రెడ్డి అడ్డా.. ఇక్కడ బీజేపీ గెలుపు ప్రేస్టేజ్ గా తీసికున్నారు.
మరి అంబర్ పేట ప్రజలు కాలేరు వెంకటేష్ కు ఓటేస్తారా? లేక రోహిన్ రెడ్డి వైపు చూస్తారా? వీరిద్దరూ కాదని సీనియర్ నేత కృష్ణ యాదవ్ కు పట్టం కడతారా వేచి చూడాల్సిందే…