టీడీపీకి మరో షాక్.. బీజేపీలోకి అంబికా కృష్ణ?

-

అంబికా కృష్ణ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. బాలకృష్ణ సినిమా వీరభద్ర, కన్యాదానం, ఆడంతే అదో టైపు సినిమాలను అంబికే నిర్మించారు.

ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో.. అప్పుడే టీడీపీ పతనం ప్రారంభమయింది. టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. మరికొందరు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. ఇవాళే ఆయన బీజేపీలో చేరనున్నారు. అంబికా కృష్ణ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.

2014లో చంద్రబాబు అంబికా కృష్ణను ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. మాజీ మంత్రి పీతల సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేసి అంబికా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

అంబికా కృష్ణ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. బాలకృష్ణ సినిమా వీరభద్ర, కన్యాదానం, ఆడంతే అదో టైపు సినిమాలను అంబికే నిర్మించారు. అంబికా కృష్ణతో పాటు ఆయన సోదరుడు అంబికా రాజా కూడా బీజేపీలో చేరనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news