కెసిఆర్ ని ఇవాంకానే పిలిచారా…? అసలేం జరిగింది…?

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుత౦ ఆయన దేశ రాజధాని ఢిల్లీ లో ఉన్నారు. సోమవారం ఉదయం భారత్ లోకి అడుగుపెట్టిన ట్రంప్… అహ్మదాబాద్ విమానాశ్రయ౦ నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమానికి చేరుకొని, అక్కడి నుంచి మోతెరా స్టేడియం కి, అక్కడి నుంచి ఆగ్రా వెళ్లి… ట్రంప్ తాజ్ మహాల్ ని దర్శించుకున్నారు. ఆయనతో పాటుగా సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ఆయనకు విందు ఏర్పాటు చేసారు. దీనికి దాదాపు 90 మంది అతిధులను పిలిచారు. అందులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఓడిస్సా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులను పిలిచినట్టు తెలిసింది. కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మాత్రం ఆహ్వాన౦ అందలేదు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడలేదు.

అయితే కెసిఆర్ ని ఆహ్వానించడానికి ప్రధాన కారణం, ట్రంప్ కుమార్తె ఇవాంకా అంటున్నారు. రెండేళ్ళ క్రితం ఆమె హైదరాబాద్ వచ్చిన సమయంలో కెసిఆర్ ఇచ్చిన ఆతిధ్యానికి ఆమె ఫిదా అయిపోయారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి ఒక లేఖ కూడా రాసారు. ఇప్పుడు అందుకే ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని కెసిఆర్ ని ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించారు అంటున్నారు. ఆమె కోరిక మేరకే అధికారులు కెసిఆర్ కి ఆహ్వానం అందించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news