భారత్‌లో ట్రంప్ మేనియా.. ఆయ‌న వచ్చేసరికి ఇంకెన్ని సిత్రాలు చూడాలో..?

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను త్వరలో జరపబోయే భారత పర్యటన పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియాలో ఢిల్లీ సందర్శన అనంతరం అహ్మదాబాద్ లోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోడీతో బాటు సంయుక్త సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక్క‌డ వ‌ర‌కు మ‌న‌కు తెలిసిందే. అయితే తన స్వార్థ ప్రయోజనాలు, సంకుచిత ధోరణితో వ్యవహరించే అమెరికాను పలు సందర్భాల్లో ఆడిపోసుకునే వారు ఎంత ఎక్కువ మందో, ప్రపంచ పెద్దన్న అంటే మోజుపడే వారు అదే స్థాయిలో ఉన్నారనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని. జనగామ జిల్లా కొన్నాయ్ గ్రామానికి చెందినరియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ బుస్సా కృష్ణ అనే వ్యక్తికి ట్రంప్‌ అంటే ప్రాణం. అందుకే అతడి విగ్రహం తయారు చేశాడు. రోజూ ట్రంప్ విగ్ర‌హానికి పాలాభిషేకం కూడా చేస్తాడు.

 

అయితే ఇలా చేయడం వల్ల తమ పరువు పోతోందని మిగతా కుటుంబసభ్యులు అతన్ని తిట్టిపోస్తున్నారట. అయినా తాను పద్ధతి మార్చుకోనని కరాఖండీగా చెప్పేస్తున్నాడా పరమ భక్తుడు. ఇదేంట‌ని అడిగితే.. ‘2016లో ట్రంప్‌ నా కలలో కనిపించాడు. అప్పటి నుంచి అతన్ని పూజించడం ప్రారంభించాను. దీనివల్ల నాకు వ్యాపారం కలిసొచ్చింది. లాభాలు వచ్చాయి. ఇదంతా ట్రంప్‌ భగవానుడి చలవే అంటున్నారు. మరోవైపు న్యూఢిల్లీకి చెందిన హిందూ సేన సభ్యులు కూడా ట్రంప్‌పై భక్తిభావంతో ఊగిపోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏం అంటే ‘ట్రంప్‌ కూడా మాలాగే ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకం. ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ప్రయత్నిస్తుండడం మాకు నచ్చింది’ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఆయ‌న ఇండియాకు వ‌చ్చే స‌రికి ఇలాంటివి ఇంకెన్ని సిత్రాలు చూడాలో..? అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news