అమెరికా లో దిగగానే మోడికి వెన్నుపోటు పొడిచిన ట్రంప్ !

-

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చాలా విజయవంతంగా సాగింది. భారత్ లో అడుగు పెట్టిన ఆ క్షణం నుండి డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీ ని పొగుడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 24వ తారీఖున ఫ్లైట్ దిగి భారత అశేష జనవాహిని తో స్వాగతం అందుకున్న డోనాల్డ్ ట్రాంప్ అహ్మదాబాద్ స్టేడియంలో ప్రసంగించారు. తన ప్రసంగంలో భారత ప్రజలను మరియు మోడీని అదేవిధంగా ఇంకా అనేక విషయాల గురించి చాలా అనుకూలంగా మాట్లాడటం జరిగింది. 

ఇదే సందర్భంలో భారత్ తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని…మోడీకి నాకు మంచి బాండింగ్ ఏర్పడిందని డోనాల్డ్ ట్రంప్ తాజా పర్యటన ఉద్దేశించి మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. ఇండియా తో అనేక ద్వైపాక్షిక మరియు పెట్టుబడులు అగ్రిమెంట్లు చేసుకున్న డోనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా వెళ్లడం జరిగింది. కాగా అమెరికాలో ఫ్లైట్ దిగగానే మోడీ తన అసలు రంగు బయటపెట్టినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

మేటర్ లోకి వెళ్తే అమెరికా కి భారత్ కంటే పాకిస్థాన్ చాలా మిత్ర దేశం. పాకిస్తాన్ ఆయుధాలను ఎక్కువగా అమెరికా దగ్గర కొంటుంది. ఇటువంటి తరుణంలో భారత్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాడికల్ ఇస్లాంని మరియు టెర్రరిస్టులను ప్రోత్సహించేది లేదని మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్లేసరికి పాకిస్తాన్ తన మిత్ర దేశం అని భారత్ మరియు పాకిస్తాన్ దేశానికి సమస్యగా ఉన్న కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానని డోనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది ఖచ్చితంగా మోడీ కి వెన్నుపోటు పొడిచినట్టు అని ఇంటర్నేషనల్ మీడియా సంస్థ డోనాల్డ్ ట్రంప్ వ్యవహారాన్ని అభివర్ణించింది. 

Read more RELATED
Recommended to you

Latest news