బ్రేకింగ్; ఢిల్లీ హింసలో పోలీసుల పాత్ర…!

-

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని ఢిల్లీ లో జరుగుతున్న హింసలో పోలీసుల పాత్ర ఉందని కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ అల్లర్ల పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సోనియా అల్లర్లలో 20 మంది చనిపోయారని ఢిల్లీ లో అల్లర్లు బాధాకరమని అన్నారు. ఢిల్లీ లో అల్లర్లు జరుగుతుంటే కేంద్రం ఎం చేస్తుందని సోనియా ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్రం బాధ్యత వహించాలి అన్నారు.

బిజెపి నేత కపిల్ మిశ్రా రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేసారని అన్నారు. ఢిల్లీలో అల్లర్లకు బిజేపినే కారణమని అన్నారు. ఢిల్లీ లో పరిస్థితి అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలను మోహరించాలని కోరారు. ప్లాన్ లో భాగంగానే ఢిల్లీ లో అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చెయ్యాలి అన్నారు. ఈశాన్య ఢిల్లీ లో అల్లర్లకు బాధ్యత వహించాలని బిజెపిని డిమాండ్ చేసారు.

పరిస్థితిని చక్కదిద్దే వరకు ప్రత్యేక బలగాలు మొహరించాలన్నారు. అల్లర్ల బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది అన్నారు. ఢిల్లీ లో హింసాత్మక పరిస్థితులు బాధాకరమని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు ఆమె. కాగా ఢిల్లీ లో పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్రం షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసి౦ది. ఢిల్లీ ప్రభుత్వం కూడా అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news