బీజేపీ కోర్ కమిటీ భేటీ.. మునుగోడు ఎన్నికలపై నేతలకు అమిత్ షా నిర్దేశం

-

హైదరాబాద్‌లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాయకులకు దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలు పక్కాగా పనిచేయాలని సూచించారు.

గ్రామాల వారీగా ఇంఛార్జ్‌ల నియామకం పూర్తి చేయాలని అమిత్ షా ఆదేశించారు. జాయినింగ్ కమిటీ ప్రగతిపై రాష్ట్ర నేతలను ఆరా తీశారు. మునుగోడు గడ్డపై కాషాయ జెండా ఎగిరేలా స్థానిక నాయకులు, రాష్ట్ర నేతలు శ్రమించాలని సూచించారు. మునుగోడులో విజయం సాధిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సులభం అవుతుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాని ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి లభించి 75 ఏళ్లయినా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రధాన మంత్రి మోదీ ప్రకటన చేసిన తర్వాతే మిగతా పార్టీలు నిద్రలో నుంచి మేల్కొన్నాయని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించ లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news