కథలో చాలా పెద్ద ట్విస్ట్ పెట్టిన అమిత్ షా !

-

2019 సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బిజెపి. దీంతో ఆ సమయంలో ఫలితాలు చూసి చాలామంది ఇక దేశంలో బీజేపీ పార్టీకి తిరుగులేదు అని కామెంట్లు చేశారు. మరియు అదే విధంగా అధికారంలోకి వచ్చిన మోడీ కేంద్రంలో ఇష్టానుసారం అయినా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో అతి తక్కువ సమయంలోనే బీజేపీ పార్టీ పై వ్యతిరేకత ముద్ర దేశంలో స్టార్ట్ అయింది. Image result for amith shahమహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరాఖండ్ తాజాగా ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇటువంటి తరుణంలో రాబోయే బీహార్ ఎన్నికలలో మొదట ఒంటరిగా పోటీ చేపట్టామని బీహార్ నేతలకు సూచించిన అమిత్ షా…తాజాగా బిజెపి పార్టీకి వస్తున్న ఫలితాలు చూసి నితీష్ కుమార్ పార్టీతోనే కలసి పోటీ చేయాలని సూచించారట. ఈ మేరకు ఇటీవల ప్రకటన కూడా చేయడం జరిగింది.

 

అయితే ఇక్కడ కథలో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే…గత అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్ మరియు లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో నితీష్ కుమార్ తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. దీంతో ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి మరియు జేడీయూ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని నితీష్ కుమార్ కి అమిత్ షా సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి ఇంకా చర్చల దశలోనే రెండు పార్టీలు ఉన్నట్లు బీహార్ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news